ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ఈ ఏడాది 9 రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక నవంబర్ 1, 2 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సూచనలు జారీ చేసింది.