రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఉమ్మడి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని అఖిలపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. ఆల్‌ఇండియా జైహింద్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు , బ్రాడీపేటలోని ఓ హోటల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేకహోదా అనే అంశంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.దశరధరామిరెడ్డి మాట్లాడుతూ..... విభజన హామీలపై పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా మేధావులు, పాలక, ప్రతిపక్షనాయకులు హోదాపై పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు సీహెచ్ శోభారాణి మాట్లాడుతూ... ముందుగా రాజధానిని నిర్ణయించిన తరువాతే హోదాపై ముందుకెళాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విరుపాక్ష నవీన్ ఆధ్వర్యంలో నవంబరు 26న ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్టు అఖిలపక్ష నాయకులు ప్రకటించారు. సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి ప్రసాదు, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు సరస్వతి, నరాల శివ, ఎంఐఎంనాయకులు బాజిద్‌రామ్, టీడీపీ నాయకులు డీఎస్సార్, ప్రత్యేకహోదా ప్రజాపోరాట పరిషత్ అధ్యక్షుడు ఫణీరాజ్ తదితరులు పాల్గొన్నారు.