ఉరవకొండ మండలం పెన్నోబలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ జలపాతం చూపర్లను ఆకట్టుకుంటుంది. దట్టమైన చెట్లు జల ధారగా పారే సేరయేళ్లు సందర్శనకులకు ఆహాదాన్ని నింపుతున్నాయి. తుంగభద్ర డ్యాం నుంచి వరదనీరు వస్తుండడంతో జలపాతం కొత్తరూపు సంతరించుకుంది. ఆనకట్టపై నుంచి కిందకు దుమ్మికే నీరు చూపారులను కట్టి పడేస్తుంది. 42 వ జాతీయ రహదారి పక్కనే ఉండడంతో అటు వైపు వెళ్లే వాహనదారులు, సందర్శకులు జలపాతాన్ని చూసి ఆనందిస్తున్నారు