విద్యార్థులు చదువుతోపాటు ఇంట ర్వ్యూలకు అవసరమైన నైపుణ్యా లను పెంపొందించుకోవాలని ఏపి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ అండ్ సిఇఓ, జెఎన్ టియూ ప్రొఫెసర్ దేవ కుమార్ సూచించారు. గుత్తి శివారు లోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియెంటేషన్ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు సమ యాన్ని వృథా చేయకుండా ఇంట ర్వ్యూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ వికె. పద్మావతమ్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ అరవింద్, వైస్ ప్రిన్సిపల్ సిద్దేశ్వర్, ఏవో కేశవరెడ్డి, హెచ్ఓడి హరిప్రియ, ప్రొఫెసర్ శాంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.