డిసెంబర్ నెల నుండి వీఐపీ బ్రేక్ దర్శనాల వేళలను మారుస్తున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.1వ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని, ఈ మేరకు రూ. 300 దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఆపన్న హస్తం పథకానికి లక్ష డిపాజిట్ ఇచ్చే వారికి ఆరు బ్రేక్ దర్శనాలను కల్పిస్తున్నామని తెలిపారు.అక్టోబర్ లో శ్రీవారిని 22.72 లక్షల మంది దర్శించుకున్నారని ఆయన తెలిపారు.