స్కూళ్ల తనిఖీకి వెళ్లి...ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్ టీచర్‌గా మారారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించి.., సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లిన మంత్రి ఉష శ్రీచరణ్ 6వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. విద్యార్థులను ఇంగ్లీష్‌లో పలు ప్రశ్నలు అడిగి, వారి నుంచి సమాధానాలు రాబట్టారు.
టీచర్లు బాగానే పాఠాలు చెబుతున్నారని.., అందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. సీఎం జగన్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తోందని.., విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి క్లాసు నుంచి నిష్క్రమంచారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను మంత్రి ఉష శ్రీచరణ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు.