సిరియాలోని హామ్స్ ప్రావిన్సులో ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై ఇజ్రాయిల్ క్షిపణులతో దాడి చేసింది. ఈ విషయాన్ని సిరియా మిలిటరీ ధ్రువీకరించింది.ఈ దాడులతో తమ ఎయిర్ బేస్ స్వల్పంగా ధ్వంసమయిందని, ఇద్దరు సైనికులు మరణించగా పెద్ద సంఖ్యలో గాయపడ్డారని తెలిపింది. ఈ విమానాశ్రయాన్ని కొంత కాలంగా ఇరాన్ వైమానిక దళం ఉపయోగించుకుంటున్నందున ఇజ్రాయెల్ దాడి చేసినట్లు సమాచారం. రన్ వేను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa