ఐపీఎల్ 2023 నుండి ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తప్పుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా ఉన్నందున ఐపీఎల్‌లో ఆడడం వీలు కాదని తెలిపాడు. రాబోయే 12 నెలల షెడ్యూల్ బిజీగా ఉందని, ఇక యాషెస్ సిరీస్, వరల్డ్‌కప్ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి రెస్ట్ తీసుకోనున్నట్లు ట్విట్టర్ లో వెల్లడించాడు. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున కమ్మిన్స్ ఆడుతున్న విషయం తెలిసిందే.