పర్యావరణ పరిరక్షణ కోసం కాప్-27 లో తీసుకున్న నిర్ణయాలకు బ్రిటన్ కట్టుబడి ఉంటుందని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు. సంపన్న దేశాలు విడుదల చేసిన ఉద్గారాలతో విపత్తులు ఎదురుకుంటున్న పేద దేశాలను ఆదుకునేందుకు లాస్ అండ్ డేమేజ్ పేరిట నిధి ఏర్పాటును స్వాగితిస్తున్నాని తెలిపారు. భూ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల మేర తగ్గించేందుకు అన్నిదేశాలు కృషి చేయాలని ఆయన కోరారు.