బంగాళఖాతంలో వాయుగుండం బలహీనపడి అల్పపీడనంలా మారిందని, ఇది దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాలోని పలు ప్రాంతాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది.