సాధారణంగా పిల్లుల జీవిత కాలం 13 నుంచి 18 ఏళ్లు. కానీ ఈ పిల్లి వయసు 26 ఏళ్లు. మరికొద్ది రోజుల్లో 27వ పుట్టినరోజు జరుపుకోనుంది. బ్రిటన్ కు చెందిన విక్కీ గ్రేన్ అనే వ్యక్తి ప్లోసీ అనే పేరుతో ఈ పిల్లిని పెంచుకుంటున్నాడు. ఒక పిల్లి 27 ఏళ్లు బతకడం అనేది మనిషి 120 ఏళ్లు బతకడంతో సమానం అని వైటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. దీంతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ పిల్లి ఫోటోలను గిన్నిస్ సంస్థ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa