ప్రస్తుతం అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి. ఇక డబ్బు విత్ డ్రా, పేమెంట్స్ కోసం ఎలాగూ ఏటీఎం కార్డు ఉంటుంది. ATM అనేది కేవలం డబ్బు చెల్లింపుల కోసమే కాకుండా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏటీఎం ద్వారా ఉచిత బీమా పొందే అవకాశం కూడా వుంది. డెబిట్ కార్డ్ ఉన్న కస్టమర్లందకూ ఫ్రీగా ఉచిత బీమాని పొందొచ్చు. డెబిట్ కార్డు ఉన్న వారికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బీమా ఇస్తున్నారు. ఎస్‌బీఐ గోల్డ్ మాస్టర్ లేదా వీసా కార్డ్ ఉన్నట్టయితే 2 లక్షల భీమా లభిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తేదీ నుంచి గత 90 రోజులలో ఒక సారి కార్డును వాడితేనే ఈ బీమా వర్తిస్తుంది.