ప్రపంచ వ్యాప్తంగా మీజిల్స్ (తట్టు) కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోని ముంబైలో మీజిల్స్ తీవ్ర రూపం దాల్చుతోంది. అక్కడ 13 మంది చిన్నారులు చనిపోయారు. తాజాగా కేరళలోని మలప్పురం జిల్లాలో 160 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. అయితే మరణాలు సంభవించలేదని డాక్టర్లు వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా దీని బారిన పడుతుంటారు. చిన్నపిల్లలకు మీజిల్స్ ఎక్కువగా వ్యాపిస్తుంది. శరీరంపై ఎర్రటి పొక్కులు, దగ్గు, జలుబు, జ్వరం వంటివి వ్యాధి లక్షణాలు.