అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి దుండగులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తాజాగా డ్రోన్ సహాయంతో ఆయుధాలను, డ్రగ్స్ ను రవాణా చేస్తుండగా బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. పంజాబ్ లోని చురివాలా చుస్తీ, ఫజిల్కా ప్రాంతంలో పాకిస్తాన్ నుండి ప్రవేశించిన డ్రోన్ ద్వారా 7.5 కేజీల హెరాయిన్, 1 పిస్టల్, 2 మ్యాగజైన్లు, 50 రౌండ్ల 9ఎంఎం మందుగుండు సామాగ్రి కలిగిఉన్న 3 ప్యాకెట్లను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. డ్రోన్ ని గమనించిన బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపి, దాన్ని అడ్డుకున్నారు.ఇంతలో, వారు సమీపంలో అనుమానిత వ్యక్తుల కదలికను గమనించారు. బలగాలు దుండగుల కదలికల దిశగా కాల్పులు జరిపగా, వారు అక్కడి నుండి పారిపోయారు: