ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని పాక్ రాయబార కార్యలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఎస్) ప్రకటించింది. శుక్రవారం జరిగిన ఈ దాడిలో ఓ సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఐసీస్ నిన్న ఓ ప్రకటన చేస్తూ పాకిస్థాన్ రాయబారి, అతడి గార్డులపై దాడి చేసింది తామేనని తెలిపింది. తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిపై పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ స్పందిస్తూ దానిని హత్యయత్నంగా పేర్కొన్నారు. ఈ దాడిపై విచారణకు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కాబూల్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ అనుమానితుడిని అరెస్ట్ చేశామని, రెండు తేలికపాటి ఆయుధాలను సీజ్ చేసినట్టు చెప్పారు.