బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను నేడు తీవ్ర తుఫానుగా రూపు మార్చుకుంది. తమిళనాడు రాష్ట్రంలో ఇది తీవ్ర ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 27 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాజధాని చెన్నై సహా, చంగల్ పట్టు, కాంచీపురం, విలుప్పురం, కొడలూర్, రాణీపేట్, వెల్లూర్, తిరువల్లూరు తదితర జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.