రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్పార్టీ మీడియా ఇన్చార్జి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంద్ర ఆవాస్ యోజనా పథకం కింద మూడేళ్లలో దేశవ్యాప్తంగా 97, 67, 825 ఇళ్లు నిర్మించారని, ఆంధ్రప్రదేశ్లో కేవలం ఐదు ఇళ్లు మాత్రమే నిర్మాంచారన్నారు. ఆ మేరకు కేంద్ర మంత్రి లోకసభకు రాతపూర్వక సమాధానమిచ్చారన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంత చేతకాని దద్దమ్మ ప్రభుత్వం మరొకటి లేదని వెల్లడించారు.
కేంద్ర సహాయక మంత్రి స్వాతి నిరంజన్ జ్యోతి లోక్సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానం మేరకు ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఐదు ఇళ్లు మాత్రమే నిర్మించారని చెప్పడం సిగ్గుచేటన్నారు. పేదలు సొంతిళ్లు నిర్మించుకోవడం కష్టమని భావించిన కేంద్రం ప్రభుత్వమే పేదలు ఇళ్లు నిర్మించాలనే భావనతో1975లోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ 20సూత్రాల ఆర్థిక కార్యక్రమం ద్వారా పేదలందరికి ఇళ్లు అనే అంశం చేర్చారన్నారు. 2004-14 మధ్య పదేళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మేనిఫెస్టోలో రూపొంచిన విధంగా అర్హులందరికీ ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.