చైనా, భారత్ ఉద్రిక్తతల నడుమ వ్యాపారం ఎందుకని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. చైనా నుంచి దిగుమతులు ఎందుకు రద్దు చేయకూడదని అన్నారు. డ్రాగన్ దేశంలో వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పినట్లవుతుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి ఉత్పత్తి చేసుకునే వస్తువులు భారత్ లో కూడా ఉత్పత్తి అవుతాయని చెప్పారు. కాగా, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడిన విషయం తెలిసిందే.