కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం స్టాంపులు కొరతను ఆసరాగా తీసుకుని జ్యుడీషియల్ మరియు నాన్ జ్యుడీషియల్ స్టాంపులను బ్లాక్ లో అమ్ముతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు.
సోమవారం మచిలీపట్నంలో బాలాజీ మాట్లాడుతూ, మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ ప్రాంతాలలో కోర్టు ఫీజ్ స్టాంపులను నాన్ జ్యుడీషియల్ స్టాంపులను కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు అమ్ముతున్న స్టాంపు వెండార్లు, మధ్యవర్తులపై చర్యలు తీసుకోవాలని బాలాజీ కోరారు.
జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నానికి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న న్యాయవాదులు కక్షిదారులు స్టాంపులు కోరత వలన తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారని బాలాజీ తెలియజేశారు. ఎంతో కాలంగా ఉన్నా ఖాళీగా ఉన్నా మచిలీపట్నం జిల్లా కోర్టులో స్టాంపు వెండర్ లేకపోవడం వల్ల, స్టాంప్ లు లేకపోవటం వల్ల న్యాయవాదులు గుమస్తాలు కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని, కేసులు దాఖలు చేయడంలో జాప్యం కలుగుతుందని బాలాజీ తెలియజేశారు.
జిల్లా రిజిస్టర్ తక్షణమే దృష్టి సారించి అన్ని న్యాయస్థానాలలో జ్యుడీషియల్ స్టాంపులు, నాన్ జ్యుడీషియల్ స్టాంపులు లభ్యం అయ్యేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బాలాజీ కోరారు. రూపాయి విలువ గల కోర్ట్ ఫీజ్ స్టాంపులు లభ్యం కాకపోవటం వల్ల అధిక విలువగల స్టాంపులను అంటించవలసి వస్తుందని తెలియజేశారు.
10 రూపాయలు విలువగల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ ను 20 రూపాయలకు జిల్లా వ్యాప్తంగా అమ్ముతున్న అధికారులు స్పందన లేదని బాలాజీ పేర్కొన్నారు. కొంతమంది స్టాంప్ వెండర్లు ధనమే ధ్యేయంగా పాత తేదీలతో స్టాంప్ పేపర్లను వేల రూపాయలతో విక్రయిస్తున్నారని వారిపై నిఘా పెంచవలసిన అవసరం ఉందని బాలాజీ తెలియజేశారు.