ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి బ్రహ్మానందపురం రైల్వే గేటు రామాలయం వద్ద రూ. 14లక్షలతో నిర్మిస్తున్న సీసీ రహదారి నిర్మాణాన్ని గురువారం ఎమ్మెల్యే ఆర్కే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా తగిన ప్రణాళికలతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రధానంగా ప్రజలకు కావాల్సిన మౌలిక వసతి సదుపాయాలను మెరుగు పర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో గ్రావెల్, సీసీ రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. రహదారి మార్గం లేక రాక పోకలకు ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదనేదే ఉద్దేశ్యమని, ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలు నుంచి వచ్చిన వినతులపై రహదారుల నిర్మాణాలను చేపట్టామన్నారు. ప్రజలు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని, నగర పరిధిలో పైపులైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. పైపు లైన్ల నిర్మాణాలు కోసం కొన్ని ప్రాంతాల్లో సీసీ రహదారులను పగులగొట్టాల్సి వచ్చిందని. పగుల గొట్టిన సీసీ రోడ్లు తిరిగి మరమ్మతులు చేయిస్తామని. స్థానిక ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.