కేన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో ‘ప్రాజెక్ట్ టీల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కేన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులతో పాటు బోధనాస్పత్రుల్లో లైటింగ్, పెయింటింగులు ఏర్పాటు చేయాలని సూచించారు. డైరెక్టర్ సూచనల మేరకు కొన్ని పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో ఇప్పటికే వీటిని ఏర్పాటు చేశారు. కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రాజెక్టు టీల్‌పై ఏపీవీవీపీ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.