చలికాలంలో నెయ్యిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి రక్షణ లభిస్తుందంటున్నారు. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. ప్రతి రోజూ ఆహారంలో నెయ్యిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా దూరమవుతుందని పేర్కొంటున్నారు. శరీరంలోని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్దీకరించేందుకు నెయ్యి సహకరిస్తుందంటున్నారు.