అనంతపురం జిల్లా, అమడగూరు, మండలపరిధిలోని గోపాలనాయక్‌తండా గ్రామంలో సిగ్నల్స్ అందకపోవడంతో ఇంటింటికి రేషన పంపిణీకి ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో బుధవారం వాహనాన్ని గ్రామానికి రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న బచ్చల వారిపల్లి రోడ్డులో నిలిపి, కార్డుదారులకు చౌకబియ్యం అందించారు. ఇంతదూరం నుంచి బియ్యం తీసుకెళ్లడానికి కార్డు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తండావాసులు తెలిపారు. ఈ సందర్భంగా తండాకు చెందిన రవీంద్ర నాయక్, శంకర్‌నాయక్, కుళ్లాయినాయక్, కాంతమ్మ తదితరులు మాట్లాడుతూ రేషన బియ్యం తీసుకోవాలంటే పనులు వదులుకోవాల్సి వస్తోందన్నారు. అంతేగాకుండా ఎక్కడ సిగ్నల్స్‌వస్తే అక్కడ నుంచి బియ్యం పంపిణీ వాహనం వద్ద బియ్యం తెచ్చుకోవాల్సిన వస్తోందని వాపో యారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు అంత దూరం నుంచి బియ్యం తెచ్చుకోవా లంటే ఇబ్బందులు పడుతున్నట్లు బాధపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్ల వద్దే బియ్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని తండా వాసులు కోరుతున్నారు.