ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదా పడుతున్న జల వనరుల శాఖ వార్షిక బడ్జెట్‌ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 13, 2023, 12:12 PM

జల వనరుల శాఖ వార్షిక బడ్జెట్‌ మాటెత్తితే రాష్ట్ర ఆర్థికశాఖ బెంబేలెత్తిపోతోంది. ఈనెల మూడో తేదీన.. ఐదో తేదీన.. తర్వాత 11న.. ఇలా వరుసగా జల వనరుల శాఖ ప్రి-బడ్జెట్‌ సమావేశాలకు సిద్ధమైంది. కానీ సమావేశాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. బుధవారం సీఎం కార్యాలయం (సీఎంవో) అధికారుల వద్ద ప్రి-బడ్జెట్‌ సమావేశం జరుగుతుందని సమాచారం ఇచ్చారు. జల వనరుల శాఖ అధికారులు ఆశగా వెళ్లారు. కానీ ఈ నెల 25న బడ్జెట్‌ ఎంతిస్తామో తేల్చేస్తామని సీఎంవో అధికారులు చెప్పారు. జల వనరుల శాఖకు 2022-23లో రూ.13,500 కోట్లు కేటాయించారు. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. ఆ నిధులు విడుదల చేయాలని అధికారులు మొత్తుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు రూ.8 వేల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని.. ఇంకో రూ.4,500 కోట్లు ఎత్తిపోతల పథకాల విద్యుత్‌కు బిల్లులు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ దృష్టికి తెచ్చారు. ఈ ప్రతిపాదనలపై ఆ శాఖ తలూపడం తప్ప.. నిధులిస్తానని హామీ ఇవ్వడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com