ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూపురంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:25 PM

హిందూపురం  పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ గురువారం ఉద్రిక్తతల నడుమ జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బలిజ కులస్థులు మూడు రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అధికారుల నుంచి అనుమతులు ఇవ్వలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి వి గ్రహ ఏర్పాటు భూమి పూజ చేయాలని బలిజ కులస్థులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న టూటౌన సీఐ వెంకటేశ్వర్లు, రూ రల్‌ సీఐ కృష్ణరెడ్డి అక్కడకు చేరుకొని వారికి నచ్చచెప్పి వెనక్కు పం పించారు. మరుసటి రోజు మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన చే యడంతో వైస్‌చైర్మన్లు బలరామిరెడ్డి, జబీవుల్లా హామీ ఇచ్చారు. వా రితో పాటు ర్యాలీగా వచ్చి భూమి పూజ చేసుకునే విధంగా పోత్సహించారు. తరువాత కౌన్సిల్‌ సమావేశంలో బలపరిచి తీర్మానం చే స్తామని తెలిపారు. ఈపరిణామంతో.. రోజుకో కథ చెబుతున్నారని బలిజ కులస్థులు ఆగ్రహించారు. దీంతో గురువారం మధ్యాహ్నం విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. అయితే పూజ జరిగే వరకూ ఉత్కంట పరిస్థితి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa