మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతాలైన బాగ్, కుక్షి ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో డైనోసార్ల అవశేషాలు బయటపడ్డాయి. వీటిలో 256 గుడ్లు, పలు గూళ్లు ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో బయటపడ్డ డైనోసార్ల అవశేషాలతో పోల్చితే.. ఇవి భిన్నంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇదిలావుంటే డైనోసార్లను సినిమాల్లో, డాక్యుమెంటరీల్లో చూడటం తప్పితే.. ప్రత్యక్షంగా చూసిన వారెవరూ లేరు. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల కిందట భూమిపై అవి తిరుగాడాయని పరిశోధకులు చెబుతారు. అంటే.. మనిషి పుట్టుకకు ఎన్నో ఏళ్ల ముందు భూమిపై ఈ భారీ జీవులు సంచరించాయి. వీటికి సంబంధించిన ఆనవాళ్లు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా నర్మదా నదీ లోయలో డైనోసార్లకు సంబంధించిన 256 గుడ్లు, ఎముకలు బయటపడ్డాయి. ఇవి భారీ పరిమాణంలో ఉన్నాయి. అంతేకాదు.. భూమి మీద సంచరించిన డైనోసార్ల కుటుంబంలో అతి పెద్ద జీవులైన ‘టిటానోసార్స్’ గుడ్లు అని పరిశోధకులు చెబుతున్నారు. పొడవాటి మెడతో, భారీ ఆకారంతో ఉండే టిటానోసార్లు శాఖాహారులని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఢిల్లీ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ఈ రీసెర్చ్‌కు సంబంధించిన నివేదిక PLoS One జర్నల్‌లో జనవరి 18న ప్రచురితమైంది.
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతాలైన బాగ్, కుక్షి ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో డైనోసార్ల అవశేషాలు బయటపడ్డాయి. వీటిలో 256 గుడ్లు, పలు గూళ్లు ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో బయటపడ్డ డైనోసార్ల అవశేషాలతో పోల్చితే.. ఇవి భిన్నంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
‘అసాధారణ రీతిలో ఇక్కడ డైనోసార్ల ఆవాసాలు బాగా దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ లభించిన గుడ్లన్నీ ఒకటి కంటే ఎక్కువ పెంకులతో నిర్మితమై ఉన్నాయి. పొదగడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు తల్లి డైనోసార్.. తన గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడంతో పెంకు మీద పెంకు ఏర్పడి ఉండవచ్చు’ అని పరిశోధకులు పేర్కొన్నారు.