పన్నుల్లో వాటాల రూపంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.41,338.02 కోట్లు రానున్నాయి. అందులో కార్పొరేషన్ పన్ను రూ.13,230.89 కోట్లు, ఆదాయపు పన్ను రూపేణా రూ.12,871.86 కోట్లు, కేంద్ర జీఎస్టీ రూపంలో రూ.13,366.77 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ రూ.1,311.32 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.549.22 కోట్లు, సేవా పన్ను రూపంలో రూ.8.3 కోట్లు వస్తాయి. అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే మొత్తం పన్నుల్లో ఏపీ వాటాగా 4.047 శాతం కేటాయించారు.