కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే నియంత్రించ వచ్చని రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ పేర్కొన్నారు. శనివారం కడప నగర శివారులోని రిమ్స్‌లో ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కేన్సర్ మహమ్మారికి మనోధైర్యమే మందు అని చెప్పారు. ప్రతిఒక్కరూ కేన్సర్‌పై అవ గాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడానికే ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 4న కేన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వరలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సిఎస్ ఆర్‌ఎంఒ డాక్టర్ శ్రీనివా సులు, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ప్రోఫ్ఫెసర్ డాక్టర్ రాజు దాసరి, నర్సింగ్ సూపరింటెండెంట్లు కళాశాల వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యా ర్థులు, కళాశాల సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.