బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ మధ్య రెండో టెస్టు నేడు జరగనుంది. తొలి టెస్టును ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన టీమిండియా, రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యంలోకి వెళ్లాలనే లక్ష్యంతో ఉంది. ఈ టెస్టును గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ భావిస్తోంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుందని తెలుస్తోంది. పుజారా ఈ మ్యాచ్ తో 100 టెస్టుల మైలురాయిని చేరుకోనున్నాడు.