జగన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేసిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తెనాలి పట్టణంలో పర్యటించి చేతి వృత్తుల వారి పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...... ప్రజల అవసరాలు సమస్యల పట్ల పాలకుల్లో అవగాహన లేనప్పుడు ఎన్ని సీట్లు తెచ్చుకున్నా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ప్రస్తుత పాలనలో ఏ వర్గం సంతోషంగా లేరని, ప్రజల ఆశలు అడియాశలయ్యాయన్నారు. ధరల భారం సామాన్యుల నడ్డి విరిచిందని, రానురాను బతుకు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో హస్త కళాకారుల జీవితాలకు భరోసా లేకుండా పోయిందన్నారు. స్వర్ణకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిచిందన్నారు. స్వర్ణకారులు తమ బిడ్డలను ఈ వృత్తిలోనికి దించడానికి వెనుకడుగు వేస్తున్నార తెలిపారు. ప్రభుత్వం గతంలో స్వర్ణకారుల వృత్తి వారికి 200యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తానని ప్రభుత్వం మాట తప్పిందన్నారు. చేతి వృత్తిల పెన్షన్లు కూడా కొన్ని కులాలకే పరిమితం చేశారని పేర్కొ న్నారు. స్వర్ణకార సమస్యలపై పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌తో చర్చించి వీరికి భవిష్యత్‌లో ప్రత్యేక పాలసీ తీసుకువస్తామన్నారు. రాజధాని అమరావతి ఆగిపోవడంతో ఈ ప్రాంత అభివృద్ది కూడా నిలిచిపోయిందన్నారు. భవిష్యత్ భరోసా లేక అన్ని వర్గాల్లో నిసత్వ ఆవహించిందని, పాలన తీరు పట్ల రోజు రోజుకు ప్రజల్లో ద్వేషభావం పెరుగుతుందని నాదెండ్ల తెలిపారు.