రక్త ప్రసరణ బాగ జరిగితే ఆరోగ్యంతోపాటు ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది. ముఖంపై ఐస్‌క్యూబ్స్‌తో మర్ధన చేస్తే.. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ఐసింగ్.. చర్మంపై ఓపెన్ పోర్స్‌ను కవర్ చేస్తుంది. చర్మంలో పేరుకున్న మురికిని బయటకు పంపుతుంది. ఐస్ క్యూబులతో నేరుగా చర్మంపై మర్ధనా చేయకూడదు. ఒక వస్త్రంలో చుట్టి మర్ధనా చేసుకోవాలి. ఐసింగ్‌ను ఒకేసారి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం చేయకూడదు. చర్మం సెన్సిటివ్‌గా ఉన్నవారు.. ఈ ఐసింగ్ పద్ధతికి దూరంగా ఉండాలి.