చాలామందికి రాత్రిపూట ఆలస్యంగా తినడం అలవాటు. అయితే ఇది అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో డిన్నర్ పూర్తి చేయాలని చెబుతున్నారు. రాత్రి 9 తర్వాత తినడం వల్ల మలబద్దకం, గ్యాస్, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని పేర్కొంటున్నారు. అలాగే నిద్ర లేమి, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతున్నట్లు ఎన్ సీబీఐ పరిశోధనలో వెల్లడైనట్లు చెప్పారు.