ఉల్లిపాయ లేనిదే.. మన వంట పూర్తికాదు. ఉల్లిపాయ మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఉల్లితో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. కేశసంరక్షణలోనూ సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువైంది. జుట్టు రాలే సమస్యను దూరం చేయడంలో.. ఉల్లి అద్భుతంగా పని చేస్తుంది. ఉల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకు సహాయపడే.. క్యాటలాజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టును సంరక్షిస్తుంది. ఉల్లిలో ఉండే జింక్, సల్ఫర్, ఫోలిక్‌యాసిడ్, బి విటమిన్, పొటాషియం వంటి పోషకాలు హెయిర్ గ్రోత్‌ను ప్రేరేపిస్తాయి. ఉల్లిలో ఉండే.. పోషకాలు బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించి.. చుండ్రు సమస్యను నివారిస్తాయి. మన జుట్టును సంరక్షించుకోవడానికి.. ఉల్లి నూనెను ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, దాని వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఉల్లి నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు.. జుట్టు సమస్యలను దూరం చేస్తాయి. ఉల్లి నూనెలోని విటమిన్ సి, విటమిన్ B9(ఫోలేట్), పొటాషియం, విటమిన్ B6 వంటి పోషకాలు... జుట్టు మూలలను దృఢంగా మారుస్తాయి. జుట్టు వేగంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలో చూద్దాం.