మామాడి పండ్లు రుచికి రుచి.... ఆరోగ్యానికి ఆరోగ్యం. కానీ మామిడి ఆకులు కూడా ఎంతో ఆరోగ్యకరమని ఎంతమందికి తెలుసు. మామిడి ఆకులలో మాంగిఫెరిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ఆల్ఫా గ్లూకోసిడేస్‌ను నిరోధిస్తుంది. మాంగిఫైరిన్ ప్రేగులలో కార్బోహైడ్రేట్ జీవక్రియను తగ్గించడంలో సహాయపడుతుంది, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. మామిడి ఆకులకు ఇన్సులిన్‌ని పెంచి గ్లూకోజ్‌ని నియంత్రించే శక్తి ఉంది. మామిడి ఆకులలో పెక్టిన్, విటమిన్ సి, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడతాయి.