కూరలోనో, చారులోనో కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేసే కరివేపాకు.. షుగర్‌ను కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. ఒక పరిశోధన ప్రకారం, కరివేపాకులో యాంటీ-హైపర్గ్లైసీమిక్ మూలకాలు అధిక మొత్తంలో ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఎన్సీబీఐ నివేదిక ప్రకారం, కరివేపాకు షుగర్ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. కరివేపాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది. కరివేపాకు ఇన్సులిన్‌ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. షుగర్‌తో బాధపడే వారు కరివేపాకు రసం తాగాలని నిపుణులు అంటున్నారు. కరివేపాకు తిన్నా మంచిదే.