కివీ పండులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. కెనడియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కివీ పండు తరచుగా తింటే.. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. కివీలోని విటమిన్ సీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది వాపు, క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. డేటా ప్రకారం ప్రతి 100 గ్రాముల కివీలో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మీరు రోజువారీ అవసరమైన ఫైబర్‌లో 12 శాతం. డైటరీ ఫైబర్ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ పండులో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఆక్టినిడిన్ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ కూడా ఉంటుంది. ఫైబర్ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలనూ దూరం చేస్తుంది.