రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను 2016లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా విత్తడానికి ముందు, పంట తరువాత కలిగే నష్టాలకు సమగ్ర పంట బీమా కవరేజీని రైతులకు అందిస్తుంది. ఊహించని పంట నష్టం కలిగితే రైతులకు ఆదుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో రైతులు స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దేశంలో 40 లక్షలకు పైగా రైతులు ఈ పథకంలో నమోదు చేసుకున్నారు.