తరచుగా నీటిని తాగితే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అవసరానికి మించి ఉండే గ్లూకోజ్ (చక్కెర) మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుందట. తరచుగా నీటిని తీసుకుంటే శరీరంలో చక్కర స్థాయిలు భారీగా పెరగకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. భోజనానికి ముందు నీళ్లు తాగాలని, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.