ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ కంటి వెలుగు ఫేజ్-3ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 35,41,151 మంది వృద్ధులను పరీక్షించనున్నారు. ఇందుకోసం 376 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను మార్చి 15 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నామని.. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. సీఎం ఆదేశాలతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.