ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు నలుగురు చిన్నారులను బలిగొంది. బారాబంకిలో నలుగురు చిన్నారులు ఉదయాన్నే ప్రార్థనల్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా, అతివేగంగా వెళ్తున్న ఓ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు స్పాట్ లోనే చనిపోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటన అనంతరం డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa