ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నువ్వు పంటను ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణా జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. అతి తక్కువ పెట్టుబడితో అనతి కాలంలోనే ఈ పంట చేతికొస్తుంది. వేసవిలో ఆరుతడి పంటగా వేసినపుడు చీడ పీడల బెడద తక్కువగా ఉండి, విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు. విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి, గింజ కట్టు దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత ౩౦-40 రోజుల నుండి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.