గుజరాత్ సూరత్ లోని అథ్వాలిన్స్ ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీలో వంజర భూత్ మామ అనే చిన్న ఆలయం ఉంది. ఇక్కడ భక్తులు దేవునికి నైవేద్యంగా సిగరెట్ సమర్పిస్తారు. 130 ఏళ్ల క్రితం ఓ వంజరుల సమూహం ఇక్కడ నివసించగా ఓ వంజర మరణించాడు. ఆ సమాధిని ఇక్కడ నిర్మించి పూజలు చేస్తున్నారు. సిగరెట్లే కాకుండా మగాస్ అనే మిఠాయిలు కూడా నైవేద్యంగా పెడతారు. ఇలా చేస్తే పనిలో ఏకాగ్రత ఉంటుందని విశ్వసిస్తారు.