వేసవిలో నీళ్లు, ద్రవ పదార్థాలు అతిగా తీసుకుంటుంటాం. ఓ వ్యక్తి కనీసం రోజుకు 2-3 లీటర్ల నీరు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అతిగా నీరు తాగితే విషపూరిత ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. మెదడు పని తీరు దెబ్బతింటుందని చెబుతున్నారు. దాహం లేకపోయినా బలవంతంగా నీరు తాగితే మత్తు ఆవరిస్తుందంటున్నారు. కిడ్నీలు శరీరం నుంచి అదనపు ద్రవాలు తొలగించలేనప్పుడు వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.