కంబదూరు మండల కేంద్రం లోని భీమునికుంట రోడ్డులో గల కస్తూరిబాయి గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో గుర్తు తెలియని అల్లరి మూకలు నిప్పు పెట్టడంతో, మంటలు చెలరేగి విద్యుత్ వైర్లు కాలిపోయి బూడిద అయిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోయాయి. దీంతో ఆ రోడ్డుకు ఇరువైపుల ఉన్న కాలనీవాసులకు, పాఠశాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గింది. విద్యుత్ సరఫరా లేక అనేక అవస్థలకు ఆ ప్రాంతపు ప్రజలు గురవుతున్నారన్న విషయం తెలుసుకున్న కంబదూరు గ్రామ సర్పంచ్ పద్మావతమ్మ తనయుడు గంగాధర ఆ ప్రాంతానికి చేరుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి, తన పొలంలో నున్న వైరును తెప్పించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా గంగాధర ను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ ప్రాంతవాసులు.