చాలా మంది యూరినరీ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో ఇంటి చిట్కాలతో సమస్య పరిష్కరించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తరచూ మంచి నీరు తాగుతూ ఉండాలని, కొంచెం తియ్యని క్రాన్ బెర్రీ జ్యూస్ తాగాలంటున్నారు. వెల్లుల్లి తినాలని, విటమిన్ సి ఉండే పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. కృత్రిమ స్వీట్నర్లు, కెఫిన్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలంటున్నారు.