మున్సిపల్ సిబ్బంది కుళాయిలకు నీరు సరఫరా చేసినపుడు ప్రజలు తాగునీరు అవసరం మేరకు పట్టు కుని తమ కుళాయిలను బంద్ చేయాలి కానీ నీరు వృధాగా రోడ్లపై వదలరాదని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రజలకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని 17వ వార్డు తిలక్ నగర్ లో కార్మికులు చేస్తున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీ లించారు. అదేవిధంగా ఆ వార్డులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కుళాయిలకు తాగునీరు సరఫరా చేసినపుడు ప్రజలు అవసరం మేరకు పట్టుకొని తమ కుళాయిలను బంద్ చేయాలి కానీ నీరును రోడ్లపైకి వృధా గా వదలరాదన్నారు. అనంతరం ప్రధాన రహదారిలోని పెద్ద మురికి కాలువలో సిబ్బంది చేసున్న పూడిక తీత పనులను పరిశీలించారు. అదే విధంగా వ్యాపారస్తులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు పొందాలని సూచిం చారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సచివా లయం శానిటరీ కార్యదర్శులు ఉన్నారు.