కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో అటల్ పెన్షన్ యోజన ఒకటి. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పింఛను అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా ఇతర సంఘటిత రంగానికి చెందిన వారు NPS సభ్యులుగా ఉంటే అసంఘటిత రంగానికి చెందిన వారు అటల్ పెన్షన్ యోజన పథకానికి అర్హులు.