జైపూర్ : రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో.. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జీపులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa