పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగాల పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం , సంక్షేమ పథకాల కోసం మార్చి 17న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ , రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి లు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 17న సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పారిశుద్ధ కార్మికులు మురికినంత శుభ్రం చేసి పట్టణంలో ఉన్న ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ ప్రజలు ఆరోగ్యాలను కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ స్థానిక సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు పన్నులు సాధించి పెట్టడంలో కార్మికులు, మున్సిపల్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నారన్నారు. శాశ్వత స్వభావం కలిగి ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయకుండా పాలకవర్గాలు మోసం చేస్తున్నాయని తెలిపారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే6 నెలల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల అందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీల వర్షం కురిపించి, గద్దెనెక్కిన ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ఔట్సోర్సింగ్ కార్మికులను బావిలో కప్పల మాదిరిగా ఆప్కా స్ ని తెచ్చి బానిస వ్యవస్థలను బంధించి పెట్టారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 14 నుండి 21 తేదీ వరకు జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి , సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప , నగర పంచాయతీ కార్మికులు యూనియన్ నాయకులు రిక్షా నరసింహులు, చిన్న వెంకటేష్, తిప్పన్న, ఈ. వెంకటేష్ , గజేంద్ర, ముత్యాలు, నరసింహులు , శాంతమ్మ, నాగమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.