కంబదూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని మంగళవారం ఇన్చార్జ్ ఎంపిడిఓ ఆంజినేయులు తనిఖీ చేశారు. జాతీయ డివార్మింగ్ దినోత్సవం (ఎన్ డిడి) కార్యక్రమంలో భాగంగా 1-19 సంవత్సరాల వయస్సు మధ్య నున్న బాల బాలికలకు నులి పురుగుల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేయాలని ఎంపిడిఓ ఆదేశించారు. ప్రతి చిన్నారికి, ప్రతి గర్భిణీలకి, బాలింతలకు, కిషోర బాలికలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని అందించి, ప్రభుత్వాశయాన్ని నెరవేర్చుటకు అంగన్‌వాడీ సిబ్బంది పనిచేయాలని ఆయన అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన సిబ్బందిని హెచ్చరించారు.